ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కార్తికమాసం ఆఖరి శనివారం.. ద్వారకా తిరుమల కిటకిట - ద్వారకా తిరుమల ఆలయంలో రద్దీ

ద్వారకా తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో భక్తుల రద్దీ నెలకొంది. కార్తిక మాసం ఆఖరి శనివారం అయినందున.. రాష్ట్రం నలుమూలల నుంచి భక్తులు అధిక సంఖ్యలో వచ్చి స్వామి వారిని దర్శించుకున్నారు.

dwaraka tirumala temple
ద్వారకా తిరుమల ఆలయం

By

Published : Dec 12, 2020, 1:35 PM IST

ప్రముఖ పుణ్యక్షేత్రం ద్వారకాతిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి శేషాచల పర్వతం భక్తులతో పోటెత్తింది. స్వామివారికి అత్యంత ప్రీతికరమైన కార్తిక మాసం ఆఖరి శనివారం అయినందున.. రాష్ట్రం నలుమూలల నుంచి భక్తులు వేలాదిగా తరలివచ్చి దర్శించుకున్నారు. దర్శనానికి వచ్చే భక్తులను ఆలయ సిబ్బంది శానిటైజర్​తో చేతులను శుభ్రం చేయించి.. థర్మల్ స్కానింగ్ ద్వారా శరీర ఉష్ణోగ్రత పరీక్షించిన తర్వాతే అనుమతిస్తున్నారు.

తెల్లవారుజాము నుంచే స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు బారులు తీరారు. కేశఖండన శాల, ప్రసాదాల కౌంటర్లు, క్యూ కాంప్లెక్స్, నిత్య అన్నదాన సత్రం భక్తులతో కిటకిటలాడాయి. దర్శనానికి సామాన్య భక్తులకు సుమారు 4 గంటల సమయం పట్టింది. ఆలయ ఈవో భ్రమరాంబ ఎప్పటికప్పుడు పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details