గత 16 నెలల్లో పోలవరం ప్రాజెక్టు పనులు ఏం చేశారో జగన్ సమాధానం చెప్పాలని మాజీ మంత్రి దేవినేని ఉమా డిమాండ్ చేశారు. పోలవరం ప్రాజెక్టుపై దిల్లీ పెద్దలను కలిశామని చెప్పిన సీఎం, ఆర్థికమంత్రి దానిపై స్పష్టమైన ప్రకటన ఎందుకు చేయలేదని నిలదీశారు. అధికారంలోకి వచ్చి 16నెలలైనా తమ అసమర్థత, అవినీతిని కప్పిపుచ్చుకునేందుకు ఇంకా తెదేపాపై నిందలు వేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలవరంలో ఎలాంటి అవినీతి లేదని కేంద్ర జలవనరుల శాఖ న్యాయస్థానానికి ఇచ్చిన నివేదికలే తమ పారదర్శకతకు నిదర్శనమని స్పష్టం చేశారు.
'16 నెలల్లో పోలవరం ప్రాజెక్టు పనులు ఏం చేశారో చెప్పాలి' - పోలవరంపై దేవినేని ఉమా
వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పోలవరం ప్రాజెక్టు పనులు ఏం చేశారో చెప్పాలని దేవినేని ఉమా నిలదీశారు. పోలవరం ప్రాజెక్టుపై కేంద్రమంత్రులను కలిసిన సీఎం జగన్.. వివరాలు ఎందుకు చెప్పలేదన్నారు.
దేవినేని ఉమా
సింగిల్ టెండర్ కోసం రివర్స్ టెండర్ డ్రామా ఆడి ప్రజల జీవితాలతో ఆటలాడుకున్నారని దేవినేని ధ్వజమెత్తారు. నిర్వాసితుల సమస్య పరిష్కరించకుండా నిర్లక్ష్యంతో వ్యవహరిస్తున్నారని ఆక్షేపించారు.
ఇదీ చదవండి: తిరుమల బ్రహ్మోత్సవాలు: సూర్యప్రభ వాహనంపై శ్రీవారి దర్శనం