ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'అవినీతి ఆరోపణలపై విజయసాయిరెడ్డి చర్చకు రావాలి' - polavaram

విజయ్​సాయిరెడ్డి అంటున్నారు... 40 రోజులు ఆగితే నా అవినీతి లెక్క తేలుస్తానని. ఇప్పుడు నేను చెప్తున్నా. ట్విట్టర్​లో కాదు... దమ్ముంటే అవినీతి ఆరోపణలపై విజయ్​సాయిరెడ్డి మీడియా ముందుకు రావాలి: మంత్రి దేవినేని

విజయ సాయిరెడ్డి వర్సెస్ దేవినేని

By

Published : Apr 28, 2019, 7:53 PM IST

దేవినేని సవాల్

మట్టిని ఎక్కువ స్థాయిలో డంపింగ్ చేయడం కారణంగానే పోలవరం ప్రాజెక్టు వద్ద భూమిలో పగుళ్లు ఏర్పడ్డాయని మంత్రి దేవినేని ఉమా మహేశ్వరరావు తెలిపారు. కోడి కత్తి డ్రామా లాగానే పోలవరం ప్రాజెక్టు ను అడ్డు పెట్టుకుని ప్రజలను వైకాపా భయబ్రాంతులను గురిచేస్తుందని మంత్రి అన్నారు. పశ్చిమగోదావరి జిల్లాలోని పోలవరం ప్రాజెక్టు పనులను దేవినేని పరిశీలించారు. హిల్ వ్యూ, ఢయాప్రమ్ వాల్, ఎగువ, దిగువ, కాపర్ డ్యాం, స్పిల్ ఛానల్, గేట్లు అమరిక వంటి పనులను పర్యవేక్షించి అధికారుల నుంచి వివరాలు సేకరించారు. శనివారం 920 కొండ ప్రాంతంలో భూమిలో ఏర్పడిన పగుళ్లును పరిశీలించారు. మట్టిని ఎక్కువ స్థాయిలో డంపింగ్ చేయడం వల్ల భూమిలో పగుళ్లు వచ్చాయని అన్నారు. ప్రాజెక్టు పనుల్లో ఇలాంటి పరిణామాలు సర్వ సాధారణమే అని కావాలనే సాక్షి పత్రిక, ఛానల్ పనుల పురోగతిపై దుష్ప్రచారం చేస్తుందన్నారు. వైకాపా నాయకుడు విజయసాయిరెడ్డి తనపై చేసిన ఆరోపణలకు కట్టుబడి ఉండాలని.. అవినీతిపై చర్చకు రావాలని సవాల్‌ విసిరారు. తాను 80 సార్లు పోలవరం వద్దకు వచ్చానని.. ప్రతిపక్ష నాయకుడు జగన్‌ మాత్రం ఒక్కసారి కూడా సందర్శించలేదని అన్నారు. పోలవరంపై విమర్శలు చేస్తున్న వైకాపా నాయకులు కేంద్రం నుంచి రావాల్సిన నిధుల గురించి ప్రధాని మోదీ వద్ద ఎందుకు మాట్లాడటం లేదని ఉమ ప్రశ్నించారు.

జూన్ నెలాఖరుకు నీళ్లిస్తాం
కాపర్ డ్యాం నిర్మాణానికి 50 రోజుల్లో 30లక్షలు క్యూబిక్ మీటర్లు లక్ష్యాన్ని పెట్టుకుని పనులు వేగవంతంగా చేస్తున్నారని అన్నారు. జూన్ 15 నాటికి ఎగువ, దిగువ కాపర్ డ్యాంలను 35 మీటర్లు ఎత్తుకు నిర్మిస్తామన్నారు. జూన్ నెలాఖరు నాటికి అనుకున్న ప్రకారం గ్రావిటీ ద్వారా నీరు ఇవ్వాలన్న లక్ష్యాన్ని నెరవేరుస్తామని వెల్లడించారు.

ABOUT THE AUTHOR

...view details