పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయటంతో పాటు నిర్వాసితులకు పునరావాసం కల్పిస్తామని శాసనసభ ఉపసభాపతి కోన రఘుపతి వ్యాఖ్యానించారు. అదే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ముందుకెళ్తుందన్నారు. పోలవరాన్ని సందర్శించిన ఆయనకు..అధికారులు, ఇంజినీర్లు స్వాగతం పలికారు. ప్రాజెక్టులో జరుగుతున్న వివిధ పనులను ఆయన పరిశీలించారు.
సకాలంలో పోలవరం ప్రాజెక్టును పూర్తి చేస్తాం: ఉపసభాపతి కోన
సకాలంలో పోలవరం ప్రాజెక్టును పూర్తి చేస్తామని శాసనసభ ఉపసభాపతి కోన రఘుపతి వ్యాఖ్యానించారు. పోలవరాన్ని సందర్శించిన ఆయనకు ప్రాజెక్టులో జరుగుతున్న వివిధ పనులను పరిశీలించారు.
సకాలంలో పోలవరం ప్రాజెక్టును పూర్తి చేస్తాం
స్పిల్ వే, స్పిల్ ఛానల్, కాపర్ డ్యాంలను ఆయన పరిశీలించారు. రాష్ట్రానికి ప్రాజెక్టు అతి ప్రధానమైనదని..ప్రాజెక్టు కోసం రాష్ట్రం మెుత్తం వెయ్యి కళ్లతో ఎదురుచూస్తోందన్నారు. సకాలంలో ప్రాజెక్టును పూర్తి చేస్తామన్నారు.
ఇదీచదవండి: ఎన్ని అడ్డంకులు సృష్టించినా యథావిధిగానే 'అమ్మఒడి' : మంత్రి సురేశ్