ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ముంపు గ్రామాల్లో ఉప ముఖ్య మంత్రి ఆళ్ల నాని పర్యటన - alla nani visited flood effected villages

బలహీనంగా ఉన్న గోదావరి గట్టులను గుర్తించి తక్షణమే రక్షణ చర్యలు చేపట్టాలని పశ్చిమగోదావరి జిల్లా యంత్రాంగాన్ని ఉప ముఖ్యమంత్రి ఆళ్ల నాని ఆదేశించారు. వరద ప్రభావిత గ్రామాల్లో ఆయన పర్యటించారు.

deputy-cm-alla-nani
deputy-cm-alla-nani

By

Published : Aug 17, 2020, 3:16 PM IST

బలహీనంగా ఉన్న గోదావరి గట్టులను గుర్తించి యుద్ద ప్రాతిపదికన రక్షణ చర్యలు చేపట్టాలని అధికారులను ఉప ముఖ్యమంత్రి ఆళ్ల నాని ఆదేశించారు. గట్టుల వద్ద నిరంతర పర్యవేక్షణ ఉండాలని చెప్పారు. పశ్చిమగోదావరి జిల్లాలోని పోలవరంలో ముంపు ప్రాంతాన్ని మంత్రి పరిశీలించారు.

వరద మరింత పెరిగే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆళ్ల నాని సూచించారు. పాతపోలవరం ప్రజలతో ఆయన మాట్లాడారు. ఎటువంటి భయాందోళన చెందవద్దని... ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.

ABOUT THE AUTHOR

...view details