ఏలూరులో రేపటి ముఖ్యమంత్రి పర్యటన సందర్భంగా... ఉప ముఖ్యమంత్రి ఆళ్ల నాని ఏలూరు ప్రభుత్వాసుపత్రి వైద్యాధికారులతో సమీక్ష నిర్వహించారు. జిల్లా కలెక్టర్ ముత్యాలరాజు, సంయుక్త కలెక్టర్ శుక్లా, ఆస్పత్రి పర్యవేక్షకులు డాక్టర్ ఏ.వీ.ఆర్. మోహన్, వైద్య అధికారులతో చర్చించారు. నగరంలో అంతుచిక్కని సమస్యతో బాధపడుతున్న వారిని పరామర్శించేందుకు రేపు ముఖ్యమంత్రి వస్తున్నట్లు అధికారులకు తెలిపారు. ఆస్పత్రుల్లో రోగులకు అందుతున్న వైద్యసేవల గురించి ఆస్పత్రి పర్యవేక్షకులు... మోహన్ వివరించారు.
ఏలూరు ప్రభుత్వాసుపత్రి వైద్యాధికారులతో ఉప ముఖ్యమంత్రి సమీక్ష - eluru crime news
ఏలూరు ప్రభుత్వాసుపత్రి అధికారులతో ఉప ముఖ్యమంత్రి ఆళ్ల నాని సమీక్ష నిర్వహించారు. అస్వస్థతకు గురైన బాధితులను పరామర్శించేందుకు రేపు ముఖ్యమంత్రి జగన్ వస్తున్నట్లు ఆళ్లనాని తెలిపారు.
ఏలూరు ప్రభుత్వాసుపత్రి వైద్యాధికారులతో ఉప ముఖ్యమంత్రి సమీక్ష