ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

రైతులకు నాణ్యమైన విద్యుత్ అందించటానికే మీటర్లు- ఆళ్ల నాని - ఉపముఖ్యమంత్రి ,వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని

రైతులకు నాణ్యమైన విద్యుత్ అందించటానికి మీటర్లు ఏర్పాటు చేస్తున్నామని ఉపముఖ్యమంత్రి, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని అన్నారు. గత ప్రభుత్వంలో పాలకులు దోపిడీకి పాల్పడ్డారే తప్పా... ప్రజాసంక్షేమానికి ఎటువంటి చర్యలు తీసుకోలేదని ఆరోపించారు.

Deputy Chief Minister and Health Minister Alla Nani
ఉపముఖ్యమంత్రి ,వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నా

By

Published : Nov 8, 2020, 3:09 PM IST

సీఎం జగన్ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను, అధికారంలోకి వచ్చిన ఏడాదిన్నర కాలంలో... 90 శాతం అమలు చేశారని ఉపముఖ్యమంత్రి, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని అన్నారు. రైతులకు నాణ్యమైన విద్యుత్ అందించటం కోసం మీటర్లు ఏర్పాటు చేశామని చెప్పారు. పశ్చిమ గోదావరి జిల్లా దెందులూరు మండలం గోపన్నపాలెంలో "ప్రజలలో నాడు ప్రజల కోసం నేడు" పాదయాత్రలో ఆయన పాల్గొన్నారు .

అలాగే స్థానిక వ్యాయామ విద్య కళాశాల ఆవరణలో నియోజకవర్గ స్థాయిలో నిర్మించే వ్యవసాయ ప్రయోగశాల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. అనంతరం దెందులూరు ఎమ్మెల్యే కోటార్ అబ్బయ్య చౌదరి వేగవరంలో మల్టీపర్పస్ సెంటర్ ను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఏలూరు ఎంపీ కోటగిరి శ్రీధర్, దెందులూరు ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి, ఉంగుటూరు ఎమ్మెల్యే పుప్పాల వాసు బాబు పాల్గొన్నారు.

ఇదీ చదవండీ...సీజేఐ పరిధిలో ఉన్నందున సమ్మతి ఇవ్వలేను: ఏజీ కె.కె.వేణుగోపాల్

ABOUT THE AUTHOR

...view details