రైతులకు మరింత ప్రయోజనం చేకూర్చే లక్ష్యంతో వ్యవసాయ సలహా మండలి ఏర్పాటు చేయడం జరిగిందని పశ్చిమ గోదావరి జిల్లా దెందులూరు ఎమ్మెల్యే కొఠారు అబ్బయ్య చౌదరి అన్నారు. దెందులూరు మండలం కొవ్వలి గ్రామంలో వ్యవసాయ సలహా మండలి తొలి సమావేశం జరిగింది. ఏడీఏ సుబ్బారావు అధ్యక్షతన శుక్రవారం సమావేశం నిర్వహించారు.
'వ్యవసాయం లాభసాటి చేయడమే ప్రభుత్వ లక్ష్యం'
వ్యవసాయాన్ని లాభసాటి చేయడమే ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి అన్నారు. దెందులూరు మండలం కొవ్వలి గ్రామంలో వ్యవసాయ సలహా మండలి తొలి సమావేశం జరిగింది.
ఎమ్మెల్యే కొఠారు అబ్బయ్య చౌదరి
వ్యవసాయాన్ని మరింత లాభసాటి చేయడమే ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి అన్నారు. ఇందుకు అధికారులు, రైతులతో సలహామండలి ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ శాఖ ఉపసంచాలకులు బ్రహ్మయ్య, సహాయ సంచాలకులు సుబ్బారావు, ఏఓ రమేష్ , సలహా మండలి చైర్మన్ గంగాధర్ రావు , సభ్యులు పాల్గొన్నారు.
ఇదీ చదవండి: కాళరాత్రికి రెండేళ్లు...అయినా కానరాని సాయం !