Delegation Of The Human Rights Committee: పశ్చిమగోదావరి జిల్లా జంగారెడ్డిగూడెంలో ఇటీవల నాటుసారా కారణంగా మృతి చెందిన వ్యక్తుల కుటుంబాలను మానవహక్కులు, సామాజిక న్యాయం రాష్ట్ర కమిటీ ప్రతినిధుల బృందం శనివారం పర్యటించింది. బాధిత కుటుంబాలను పరామర్శించి, క్షేత్ర స్థాయిలో జరిగిన అంశాలను క్షుణ్ణంగా విచారించారు.
బాధిత కుటుంబాలను పరామర్శించామని, తమ దృష్టికి వచ్చిన అంశాలను ప్రభుత్వానికి నివేదిక రూపంలో అందిస్తామని సంఘం రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి వి. ఆర్ మోహన్ శర్మ తెలిపారు. నాటు సారా తయారీ, విక్రయాలు జరుగకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని, నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు అమలు చేయాలని డిమాండ్ చేశారు.