దెందులూరు మండలం గుందేరు డ్రైన్ లో వరద ప్రవాహం తగ్గుముఖం పట్టింది. మంగళవారం నాడు గ్రామంలోని ఇళ్లల్లోకి చేరిన నీరు.. బుధవారం ఉదయం నుంచి తగ్గుముఖం పడుతూ వచ్చింది. కొమిరెపల్లి, సత్యనారాయణపురం తదితర ప్రాంతాల్లో ఇంకా పెద్ద ఎత్తున నీరు నిలిచి ఉంది. మరో రెండు రోజుల్లో వరద పూర్తిగా తగ్గే అవకాశం ఉన్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. మరోవైపు.. చెరువులకు గండ్లు పడిన చోట పూడ్చడానికి వెంటనే చర్యలు చేపట్టాలని రైతులు కోరుతున్నారు.
శాంతించిన గుందేరు డ్రైన్.. తగ్గుముఖం పడుతున్న ప్రవాహం - Gunderu Drain at denduluru latest update news
పశ్చిమ గోదావరి జిల్లా దెందులూరు మండలం గుందేరు డ్రైన్ లో వరద ప్రవాహం తగ్గుముఖం పడుతోంది. ఇళ్లల్లోకి చేరిన నీరు క్రమంగా తగ్గుతున్న ఫలితంగా.. స్థానికులు ఊపిరి పీల్చుకుంటున్నారు. మరింత వరద ప్రవాహం తగ్గే అవకాశం ఉన్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు.

గుందేరు డ్రైన్ లో తగ్గుముఖం పడుతున్న నీటి ప్రవాహం
గుందేరు డ్రైన్ లో తగ్గుముఖం పడుతున్న నీటి ప్రవాహం
ఇవీ చూడండి: