ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

పశ్చిమగోదావరి జిల్లాలో తగ్గుతున్న అటవీ విస్తీర్ణం! - తగ్గుతున్న అటవీ విస్తీర్ణం..

పశ్చిమగోదావరి జిల్లాలో లింగపాలెం, జంగారెడ్డిగూడెం గ్రామీణ, జంగారెడ్డిగూడెంలో ప్రకృతి మానవుడికి అందించిన గొప్ప ఆస్తి అడవి. సహజ సిద్ధమైన అడవులను నాశనం చేస్తుండటంతో పర్యావరణ సమతుల్యం దెబ్బతిని విపత్తులు సంభవిస్తున్నాయి. మరో వైపు అధిక ఉష్ణోగ్రతలు, వర్షాభావ పరిస్థితులు నానాటికి పెరుగుతున్నాయి.

Decreasing acreage .. Today is World Forest Day
తగ్గుతున్న అటవీ విస్తీర్ణం..

By

Published : Mar 21, 2021, 8:20 PM IST

పశ్చిమగోదావరి జిల్లాలో లింగపాలెం, జంగారెడ్డిగూడెం గ్రామీణ, జంగారెడ్డిగూడెంలో ప్రకృతి మానవుడికి అందించిన గొప్ప ఆస్తి అడవి. సహజ సిద్ధమైన అడవులను నాశనం చేస్తుండటంతో పర్యావరణ సమతుల్యం దెబ్బతిని విపత్తులు సంభవిస్తున్నాయి. మరో వైపు అధిక ఉష్ణోగ్రతలు, వర్షాభావ పరిస్థితులు నానాటికి పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే 1986లోనే భారత ప్రభుత్వం అటవీ విధానాన్ని తీసుకొచ్చింది. భూ భాగంలో 33 శాతం అడవులు ఉండాలని నిర్దేశించారు.

పోలవరం పరిసరాల నుంచి కొందరు వేటగాళ్లు అడవి పందులను వేటాడి జిల్లాలోని కామవరపుకోట, లింగపాలెం, జంగారెడ్డిగూడెం తదితర మండలాల్లో వాటి మాంసం విక్రయాలు చేస్తున్నారు. అదే విధంగా గోదావరి నదీ మార్గం ద్వారా వన్యప్రాణులను రాత్రి వేళల్లో రవాణా చేస్తున్నట్లు తెలుస్తోంది.

గతంలో చెన్నైకు చెందిన డబ్ల్యూసీసీబీ అనే వన్యప్రాణుల రక్షణ దర్యాప్తు సంస్థ ఇచ్చిన ఫిర్యాదు మేరకు జంగారెడ్డిగూడెంలో పులి చర్మం రవాణా చేస్తున్న ఏడుగురు వ్యక్తులను అరెస్టు చేశారు. వారి నుంచి పులి చర్మాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఫేస్‌బుక్‌ ద్వారా వన్యప్రాణుల విక్రయాలకు ఈ ముఠా ఒప్పందాలు కుదుర్చుకుంటున్నట్లు తేలింది.

వన్యప్రాణులకూ కొరవడిన రక్షణ

ఉభయ గోదావరి జిల్లాల్లో వ్యాపించి ఉన్న పాపికొండలు అభయారణ్యంలో వన్యప్రాణులకు రక్షణ కొరవడింది. గోదావరి పరివాహక ప్రాంతంలో అపార అటవీ సంపద ఉన్న పాపికొండలు అభయారణ్యంలో వన్య ప్రాణుల వేట, రవాణా గుట్టుచప్పుడు కాకుండా సాగుతోంది. పాపికొండలు అభయారణ్యం సంరక్షణకు సుమారు 100 మంది సిబ్బంది ఉన్నారు. దట్టమైన అడవిలో అరుదైన వన్య ప్రాణులు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. అడవి దున్నలు, చిరుత పులులు, పెద్ద పులి వంటి ప్రధాన అడవి జంతువులతో పాటు అడవి పందులు, దుప్పులు, ఎలుగుబంట్లు, జింకలు అధిక సంఖ్యలో ఉన్నాయి. వేసవి కాలంలో జంతువులు అడవిలో నీటి వసతి లేక సరిహద్దు గ్రామాలకు వస్తున్నాయి. ఈ క్రమంలో వేటగాళ్లు సరిహద్దుల్లో ఉచ్చులు ఏర్పాటు చేస్తున్నారు.

దీనిపై అటవీ శాఖ అధికారి సెల్వం మాట్లాడుతూ వన్య ప్రాణుల రక్షణకు బేస్‌ క్యాంపులు ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. వన్య ప్రాణులకు తాగునీటి సౌకర్యం కోసం గతంలో 50 నీటి గుంతలు ఏర్పాటు చేశామన్నారు. నూతనంగా మరో 30 గుంతలు ఏర్పాటు చేయనునున్నట్లు వివరించారు.

జిల్లాలో 8,50,700 హెక్టార్ల భూ భాగం ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం అటవీ సంరక్షణ చర్యలు చేపట్టినా క్షేత్రస్థాయిలో మెరుగైన ఫలితాలు ఉండటంలేదు. జిల్లాలో 268 వన సమితులు ఉన్నాయి. వీటికి 59,711 హెక్టార్ల అడవులను అప్పగించారు. అయితే వీటిలో 134 సమితులు క్రియాశీలకంగా లేవు.

ఉండాల్సిన అటవీ విస్తీర్ణం: 2.80 లక్షల హెక్టార్లు

ఉన్నది: 1.30 లక్షల హెక్టార్లు

ఇవీ చూడండి:

విశాఖలోని మధురవాడ, వికలాంగుల కాలనీల్లో నీటి సమస్య

ABOUT THE AUTHOR

...view details