పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డిగూడెం మండలం శ్రీనివాసపురం చెరువులో ఓ మృతదేహం లభ్యమైంది. మృతుడు శ్రీనివాసపురానికి చెందిన ముప్పిడి రాజు(18)గా గుర్తించారు. రాజు మృతిపై తల్లిదండ్రులు, బంధువులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. దీనిపై కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేపట్టారు. యువకుడి మృతికి గల కారణాలను కనుగొనేందుకు విచారణ ప్రారంభించారు.
DEAD BODY: చెరువులో మృతదేహం.. కుటుంబ సభ్యుల అనుమానం - క్రైమ్ వార్తలు
పశ్చిమ గోదావరి జిల్లా శ్రీనివాసపురం గ్రామంలోని చెరువులో ఓ యువకుడి మృత దేహం కలకలం రేపింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
చెరువులో మృతదేహం