పశ్చిమ గోదావరి జిల్లాలో కురిసిన అకాల వర్షాలకు వరి పంట 81 హెక్టార్లలో నేల వాలింది. 54 హెక్టార్లలో ధాన్యం తడిసింది. 130 హెక్టార్లలో మొక్కజొన్న, 19 హెక్టార్లలో వేరుశనగ, 4 హెక్టార్లలో పొగాకు పంటకు నష్టం వాటిల్లిందని ప్రాథమికంగా గుర్తించినట్లు జేడీఏ గౌసియాబేగం తెలిపారు. ద్వారకా తిరుమల మండలంలో 29 హెక్టార్లలో అరటి పంట దెబ్బతిందని ఉద్యానశాఖ డీడీ సుబ్బారావు వెల్లడించారు.
షెడ్డు కూలి యాచకుడి మృతి
భీమడోలు మండల వ్యాప్తంగా శనివారం రాత్రి ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. భీమడోలు రైల్వేస్టేషన్ ప్లాట్‌ఫాంపై షెడ్లు కుప్పకూలాయి. ఆ సమయంలో ఓ షెడ్డులో విశ్రాంతి తీసుకుంటున్న యాచకుడు బోలేబాబా (65) తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతిచెందాడు.