పశ్చిమగోదావరి జిల్లా జంగారెడ్డిగూడెం మండలం దేవులపల్లిలో ఓ దళిత రైతు తన పొలంలో శిరోముండనం చేయించుకుని నిరసన వ్యక్తం చేశాడు. రెవెన్యూ అధికారులు ఎలాంటి నోటీసులు జారీ చెయ్యకుండా తమ పట్టా భూమిని స్వాధీనం చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశాడు. 60 ఏళ్ల నుంచి సర్వే నంబర్ 230లో 60 సెంట్లు భూమిని తమ కుటుంబం సాగు చేస్తోందని బాధితుడు తెలిపాడు. ప్రస్తుతం తమ కుటుంబానికి ఆ భూమే ఆధారం అని చెప్పాడు. 2013 భూసేకరణ చట్ట ప్రకారం తమ భూములకు, పాడు చేసిన పంటకు నష్ట పరిహారం ఇచ్చి భూములు తీసుకోవాలని కుటుంబంతో కలిసి ఆందోళన చేశాడు.
న్యాయం కోసం దళిత రైతు శిరోముండనం - ఏపీలో భూసేకరణ వివాదం
రెవెన్యూ అధికారుల తీరుకు వ్యతిరేకంగా పశ్చిమగోదావరి జిల్లాలో ఓ రైతు వినూత్నంగా నిరసన వ్యక్తం చేశాడు. 60 ఏళ్లుగా తన కుటుంబానికి ఆధారమైన భూమిని తీసుకోవద్దంటూ... ఆ పొలంలోనే శిరోముండనం చేయించుకున్నాడు.
Dalit farmer protests against revenue officials in west godavari