పశ్చిమ గోదావరి జిల్లా ఉంగుటూరు మండలం చిన్నవెల్లమిల్లిలో ఇళ్ల స్థలాల కోసం... ఎన్నో ఏళ్లుగా ఉంటున్న తమ నివాసాలు తొలగిస్తున్నారంటూ దళితులు ఆందోళన చేశారు. సర్వే నెంబరు 219లోని గ్రామకంఠం భూమిలో తాము ఎన్నో ఏళ్లుగా ఉంటున్నామని.. వాటిని ఖాళీ చేయించడం దారుణమని వాపోయారు. తమలో చాలామంది ఇంటి, కుళాయి, విద్యుత్ బిల్లులు చెల్లిస్తున్నామని చెప్పారు.
ఇళ్లు తొలగిస్తున్నారంటూ దళితుల ఆందోళన
తాము ఎన్నో ఏళ్లుగా నివాసం ఉంటున్న స్థలాలను రెవెన్యూ అధికారులు బలవంతంగా లాక్కొంటున్నారంటూ.. పశ్చిమగోదావరి జిల్లా చిన్నవెల్లమిల్లిలో దళితులు ఆందోళన చేపట్టారు. పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వడం కోసం తమ తలమీద గూడు తీసేస్తారా అంటూ ప్రశ్నించారు.
నివాసాలు తొలగిస్తున్నారంటూ దళితుల ఆందోళన
మరికొంతమంది స్థలాలు రిజిస్ట్రేషన్ చేయించుకున్నారని.. వారినీ బలవంతంగా ఖాళీ చేయిస్తున్నారని ఆరోపించారు. ప్రభుత్వ జీవోలను తుంగలోకి తొక్కి దళితుల భూములు లాక్కోవడం ఏంటని ప్రశ్నించారు. ప్రభుత్వ ఆదేశాల మేరకే తాము పని చేస్తున్నామని రెవెన్యూ అధికారులు చెప్పారు.
ఇవీ చదవండి... ద్వారక తిరుమల నూతన ఈవోగా ప్రభాకర్‌రావు