పశ్చిమగోదావరి జిల్లా దెందులూరు మండలం కొత్తగూడెం, కొమిరేపల్లి, సింగవరం గ్రామాల్లో 1500 కుటుంబాలకు.. దాతల సహాయంతో సేకరించిన నిత్యావసరాలు స్థానిక వైకాపా నేతలు పంపిణీ చేశారు. మార్కెట్ నుంచి కొనుగోలు చేసి తీసుకువచ్చిన నిత్యావసర సరకులు, కూరగాయలు, పెరుగు ప్యాకెట్లను ప్యాకింగ్ చేసి ఇంటింటికీ తిరిగి అందజేశారు.
1500 కుటుంబాలకు నిత్యావసరాలు పంపిణీ - దెందులూరులో నిత్యావసరాలు పంపిణీ వార్తలు
కరోనా నేపథ్యంలో లాక్ డౌన్ కారణంగా ఇబ్బందులు పడుతున్నవారికి దాతలు తమవంతు సహాయం చేస్తున్నారు. నిత్యావసరాలు, కూరగాయలు పంచుతూ ఆపన్నహస్తం అందిస్తున్నారు.
![1500 కుటుంబాలకు నిత్యావసరాలు పంపిణీ daily needs distribute to people at denduluru west godavari district](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-6975121-927-6975121-1588072737129.jpg)
1500 కుటుంబాలకు నిత్యావసరాలు పంపిణీ