పశ్చిమ గోదావరి జిల్లా తణుకు మండల పరిధిలోని నాయి బ్రాహ్మణులకు, ఆటో డ్రైవర్లకు.. తణుకు ఎమ్మెల్యే కారుమూరి వెంకట నాగేశ్వరరావు నిత్యావసర సరకులు, కూరగాయలు, కోడిగుడ్లు అందజేశారు.
ఆటో డ్రైవర్లు, నాయీ బ్రాహ్మణులకు సరకుల పంపిణీ - తణుకులో నాయి బ్రాహ్మణులకు సరకులు పంపిణీ
కరోనా మహమ్మారి కారణంగా లాక్ డౌన్ విధించిన నేపథ్యంలో ఉపాధి కోల్పోయి ఇబ్బందులు పడుతున్న వారికి.. పార్టీ నేతలు, దాతలు అండగా నిలుస్తున్నారు. వారికి తోచిన విధంగా సాయపడుతూ ఆసరా అందిస్తున్నారు.

ఆటో డ్రైవర్లకు నిత్యావసరాలు పంపిణీ
కరోనా ప్రభావంతో లాక్ డౌన్ కారణంగా వారికి ఉపాధి లేకుండా పోయిందని అన్నారు. వారిని ఆదుకోవడానికి తన వంతు సాయం అందిస్తున్నట్లు తెలిపారు. సుమారు 200 మందికి సరకులు పంపిణీ చేశారు.
ఇవీ చదవండి:
వెయ్యి కుటుంబాలకు సరకులు పంచిన ఓఎన్జీసీ