దేవీశరన్నవరాత్రి మహోత్సవాల్లో భాగంగా పశ్చిమగోదావరి జిల్లా తణుకు మండలం దువ్వ గ్రామంలో ఉన్న దానేశ్వరి అమ్మవారు మూడవరోజు గాయత్రీ దేవి అలంకారంలో భక్తులకు దర్శనమిస్తున్నారు. ఉత్సవాల్లో భాగంగా అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. సకల మంత్రాలకు, అనుష్టానాలకు, ఉపనిషత్తులకు మూలమై భూమి, ఆకాశం, నీరు, అగ్ని, వాయువు, తేజస్సులను తనలో ఇముడ్చుకుని సత్వ, తమో, రజో గుణాలకు ప్రతీకగా సకల వేదాలకు వేదమాతగా గాయత్రీదేవి రూపంలో అమ్మవారు నవరాత్రుల్లో దర్శనమిస్తారని పురాణ కథనం. అలాంటి గాయత్రీదేవి అలంకారంలో అమ్మవారిని ఆరాధించిన వారికి వాక్ శుద్ధి కలుగుతుందని భక్తులు నమ్మకం. దీంతో జనం అధిక సంఖ్యలో ఆలయానికి వచ్చి మొక్కులు చెల్లించుకున్నారు.
గాయత్రీదేవిగా దర్శనమిస్తున్న దువ్వ దానేశ్వరి - duvva daneshwari
రాష్ట్రవ్యాప్తంగా దేవీ శరన్నవరాత్రి మహోత్సవాలు వైభవంగా నిర్వహిస్తున్నారు. ఆలయ ప్రాంగణాలు వేదమంత్రాలతో, పూల పరిమళాలతో నిండిపోయాయి. పశ్చిమగోదావరి జిల్లా తణుకు మండలం దువ్వ గ్రామంలో అమ్మవారు గాయత్రీదేవి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చింది.
గాయత్రీదేవిగా దానేశ్వరి అమ్మవారు