అక్టోబర్ 2, గాంధీ జయంతి వేడుకలను పురస్కరించుకుని, అహింస యాత్ర పేరుతో పశ్చిమగోదావరి తాడేపల్లిగూడెం నిట్ విద్యార్థులు సైకిల్ ర్యాలీ నిర్వహించారు. నీట్ డైరెక్టర్ సీఎస్ ప్రకాష్ రావు ర్యాలీని ప్రారంభించి, కాసేపు సైకిల్ తొక్కారు. సుమారు 200 మంది విద్యార్థులు ఈ ప్రదర్శనలో పాల్గొన్నారు. గాంధీయిజాన్ని భావి తరాలకు అందించాలన్న సదుద్దేశంతో అహింస యాత్ర ప్రారంభించామని ప్రకాశరావు పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు 150 వ గాంధీ జయంతిని ఘనంగా నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు.
అహింస యాత్ర పేరుతో నీట్ విద్యార్థుల సైకిల్ ర్యాలీ - పశ్చిమగోదావరి
అక్టోబరు 2, గాంధీ జయంతిని పురస్కరించుకుని నీట్ విద్యార్థులు అహింసయాత్ర పేరుతో సైకిల్ ర్యాలీ చేపట్టారు. పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో జరిగిన ఈ ర్యాలీ ప్రజలను ఆకట్టుకుంది.
సైకిల్ ర్యాలీ చేపట్టిన నీట్ విద్యార్దులు