పల్లె, పట్టణం, చిన్నా, పెద్దా అనే భేదం లేకుండా మహమ్మారి వెంటాడుతుంటే.. కొంతవరకూ ప్రజలు స్వీయ నియంత్రణ పాటిస్తున్నారు. అయినప్పటికీ కరోనా కేసులు అధిక సంఖ్యలో నమోదు అవుతున్న పరిస్థితుల్లో.. ప్రభుత్వం, అధికార యంత్రాంగం అప్రమత్తమై అడ్డుకట్టవేసేందుకు మరింత నియంత్రణ చర్యలు చేపట్టాయి. ఇందులో భాగంగానే మధ్యాహ్నం 12 గంటల నుంచి మరుసటిరోజు ఉదయం 6 గంటల వరకు ప్రభుత్వం పాక్షిక కర్ఫ్యూ విధించింది. కర్ఫ్యూను అమలు చేయడానికి పోలీసులు తీవ్రంగా కృషిచేస్తున్నారు.
నిబంధనలు ఉల్లంఘిస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకొంటున్నారు. పశ్చిమ గోదావరి జిల్లాలోని తణుకు, ఉండ్రాజవరం తదితర మండలాల్లో నిబంధనలు ఉల్లంఘిస్తున్న వారిపై కేసులు నమోదు చేసి, వాహనాలు సీజ్ చేస్తున్నారు. తణుకులో ఛాంబర్ ఆఫ్ కామర్స్ స్పందించి దుకాణాలను మూసివేయటానికి నిర్ణీత సమయానికి కనీసం పావుగంట ముందు సంసిద్ధత కావాలని తెలియపరిచింది.