ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

లాక్​డౌన్​ ఎఫెక్ట్: మెడికల్​ షాపుల ముందు జనం బారులు - ఏపీ కరోనా వార్తలు

లాక్​డౌన్ ప్రభావంతో పశ్చిమ గోదావరి జిల్లాలోని తణుకులో మెడికల్ షాపుల ముందు రద్దీ ఎక్కువగా ఉంటోంది. నిర్ణీత సమయంలోనే మందుల కొనుగోలుకు అవకాశం ఉండటంతో జనాలు బారులు తీరుతున్నారు. ఎండ తీవ్రతతో వినియోగదారులకు ఇబ్బంది కలగకుండా షాపుల ముందు షామియానాలను ఏర్పాటు చేస్తున్నారు యజమానులు.

medical shops
medical shops

By

Published : Mar 27, 2020, 1:14 PM IST

లాక్​డౌన్​ ఎఫెక్ట్: మెడికల్​ షాపుల ముందు జనం బారులు

కరోనాను కట్టడి చేసేందుకు ప్రభుత్వం విధించిన లాక్​డౌన్ ప్రభావంతో పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో మెడికల్ షాపుల ముందు జనాలు క్యూ కడుతున్నారు. మందుల కొనుగోలుకు వచ్చే వారిని నిర్ణీత సమయంలోనే పట్టణంలోకి పోలీసులు అనుమతిస్తున్నారు. దీనివల్ల మెడికల్ షాపుల ముందు కొన్నివేళల్లో రద్దీ ఎక్కువగా కనిపిస్తోంది. సామాజిక దూరం పాటిస్తుండటం వల్ల మందుల దుకాణం ముందు బారులు కనిపిస్తున్నాయి. ముందుల కోసం వినియోగదారులు ఎండలో నిలబడాల్సి వస్తోంది. వారి ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని దుకాణాల ముందు షామియానాలు వేయిస్తున్నారు యజమానులు.

ABOUT THE AUTHOR

...view details