ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ధరలు పెంచినా... దూరం తగ్గించలేకపోతున్నారు..! - latest news of west godavari dst

మద్యం ధరలు మరో 50 శాతం పెంచినా... పశ్చిమగోదావరి జిల్లాలో మద్యం దుకాణాల వద్ద మందుబాబుల రద్దీ తగ్గలేదు. ఎక్సైజ్ సిబ్బంది, ఆర్టీసీ సెక్యూరిటీ గార్డులు బ్రాందీ షాపు వద్ద విధులు నిర్వహించి... మందు బాబులు భౌతికదూరం పాటించడం కోసం చర్యలు చేపట్టారు. పలుమార్లు మందుబాబులను నియంత్రించడం వారి తరం కాలేదు

vcroud at wine shops even heavy rate of liquor in west godavari dst
croud at wine shops even heavy rate of liquor in west godavari dst

By

Published : May 5, 2020, 8:28 PM IST

పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం మండలం ఎల్.బి చర్ల బ్రాందీ షాపు వద్ద రెండో రోజు కూడా మద్యం కోసం మందుబాబులు అర కిలోమీటరు మేర క్యూ కట్టారు. విధులు నిర్వహిస్తున్న వివిధ శాఖల సిబ్బంది... ఎన్ని చర్యలు చేపట్టినా మందుబాబులు వారి తీరు మార్చుకోవడం లేదు. ఫలితంగా స్థానిక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. నరసాపురం రెడ్ జోన్ ప్రాంతంలోని వారు కూడా మద్యం కోసం బయటకు వస్తున్నారని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు స్పందించి మద్యం దుకాణాన్ని కొంతకాలం మూసివేయాలని కోరుతున్నారు.

ABOUT THE AUTHOR

...view details