ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

పశ్చిమలో పంటల మునక... ఉప్పొంగుతున్న ఎర్ర కాలువ - పశ్చిమగోదావరిలో వర్షాలు

పశ్చిమ గోదావరి జిల్లా గోపాలపురంలోని కొవ్వాడ కాలువ, ఎర్ర కాలువలు వరద నీటితో ఉప్పొంగుతున్నాయి. ద్వారకాతిరుమల మండలం ఐ.ఎస్.రాఘవాపురం ఐ.ఎస్.జగన్నాధపురం వద్ద ఎర్ర కాలువ ఉదృతంగా ప్రవహిస్తోంది. పంట పొలాల్లోకి నీరు చేరింది. పంటలు చేతికొచ్చే సమయంలో తీవ్ర నష్టం వాటిల్లిందని రైతులు ఆవేదన చెందుతున్నారు.

crops have damaged due to heavy rains in west godavari
పశ్చిమలో పంటల మునక... ఉప్పొంగుతున్న ఎర్ర కాలువ

By

Published : Oct 14, 2020, 7:43 PM IST

వర్షాల కారణంగా పశ్చిమ గోదావరి జిల్లా గోపాలపురంలోని కొవ్వాడ కాలువ, ఎర్ర కాలువలు వరద నీటితో ఉప్పొంగుతున్నాయి. ద్వారకాతిరుమల మండలం ఐ.ఎస్.రాఘవాపురం ఐ.ఎస్.జగన్నాధపురం వద్ద ఎర్ర కాలువ ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. కాలువ నుంచి ప్రవహిస్తున్న వరద నీటితో చుట్టుపక్కల పంట పొలాలు పూర్తిగా నీట మునిగాయి. పంట చేతికొచ్చే సమయంలో వరదలు రావడంతో తీవ్ర నష్టం వాటిల్లిందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

వరద నీరు పలు కాలనీల్లోని నివాస గృహాల్లోకి చేరడంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గోపాలపురం మండలం చిట్యాల, వెంకటాయపాలెం వద్ద కొవ్వాడ కాలువ జలాశయం ఉద్ధృతికి ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. ప్రభుత్వం చర్యలు తీసుకుని నష్ట పరిహారం చెల్లించాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details