పశ్చిమ గోదావరి జిల్లా తణుకు, ఉండ్రాజవరం పరిసర ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. పల్లపు భూముల్లోని నారుమళ్లు, నాట్లు నీట మునిగాయి. కొన్ని చోట్ల పొలాలు నీట మునిగి చెరువులను తలపిస్తున్నాయి. మరికొన్ని చోట్ల నాట్లు చివరి వరకు మునిగిపోవడం రైతులను కంగారు పెడుతోంది.
ప్రస్తుత పరిస్థితుల్లో రైతులందరూ పశ్చిమబెంగాల్ కూలీలు అందుబాటులో లేక స్థానికుల మీదే ఆధారపడ్డారు. అందువల్ల ఎకరం విస్తీర్ణానికి 30 కిలోల వంతున విత్తనాలతో నారుమళ్లు పెంచారు. కురుస్తున్న వర్షాలతో నారుమళ్లు, నాట్లు కుళ్లిపోతాయని రైతులు ఆందోళన చెందుతున్నారు.