ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

అన్నదాతకు అందని అంచనాలు - పశ్చిమగోదావరిీ

పెథాయ్ తుపాను కారణంగా నష్టపోయిన రైతుల నడ్డివిరిచాయి సర్వేలు. వ్యవసాయ శాఖ రూపొందించిన జాబితాలో తమ పేర్లు లేక లబోదిబోమంటున్నాడు అన్నదాత

పెథాయ్ తుపానులో నీట మునిగిన పంట

By

Published : Feb 12, 2019, 8:08 AM IST

పెథాయ్ తుపానులో నీట మునిగిన పంట
చేతికందిన పంట నీట పాలైంది...అకాల వర్షం కర్షకుడికి కన్నీరు మిగిల్చింది. గతేడాది డిసెంబర్​లో వచ్చిన పెథాయ్ తుపానుతో అన్నదాత పరిస్థితి ఇది. పెథాయ్ ప్రభావంతో తీవ్రంగా నష్టపోయిన జిల్లాల్లో పశ్చిమగోదావరి ఒకటి. జిల్లాలో వేల హెక్టార్లలో పంట నీట మునిగింది. పంట నష్టం ఆవేదన చెందుతున్న రైతన్నలకు ఇప్పుడో కొత్త చిక్కొచ్చిపడింది. పంట సర్వేలో తప్పిదాలు రైతులకు నష్టపరిహారాన్ని అందకుండా చేశాయి.

పెథాయ్ తుపాను ప్రభావంతో జిల్లాలో 18 వందల ఎకరాల్లోనే పంట నష్టం జరిగిందని వ్యవసాయ శాఖ అంచనా వేసింది. ఈ నివేదికతో పరిహారం అందే రైతుల సంఖ్య తగ్గిపోయింది. వ్యవసాయ చేపట్టిన సర్వే పూర్తిస్థాయిలో లేదని అన్నదాత ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

జిల్లాపై తీవ్రస్థాయిలో ప్రభావం చూపిన పెథాయ్, వరి, మొక్కజొన్న, పొగాకు, మిరప, అపరాలు, అరటి పంటలకు తీవ్ర నష్టాన్ని మిగిల్చింది. 33 శాతం కన్నా అధికంగా పంట నష్టం వాటిల్లితే నష్ట పరిహారం అందించాలన్న నిబంధనలు రైతుల పాలిట శాపంగా మారాయి. రైతన్నలు నష్ట పోయిన పంట 33 శాతం దాటలేదన్న కారణంతో నష్ట పరిహారం అందించలేమని అధికారులు అంటున్నారు.

భారీ వర్షంతో నెలకూలిన పంటను ఎన్నో వ్యయప్రయాసలు కూర్చి, అమ్మకానికి సిద్ధం చేసినా సరైన మద్దతు ధర రాలేదని రైతులు వాపోయారు. సాధారణ దిగుబడిలో 80 శాతం తగ్గినట్లు రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

జిల్లాలోని లింగపాలెం, చింతలపూడి, జంగారెడ్డిగూడెం, ద్వారక తిరుమల, కొవ్వూరు, దేవరపల్లి, నల్లజర్ల, కామవరపుకోట మండలాల రైతులు తీవ్రంగా నష్టపోయారు.

వ్యవసాయ శాఖ అంచనాల ప్రకారం జిల్లాలో 20 వేల ఎకరాల్లో మిరప పంటను సాగుచేస్తే 3 వేల ఎకరాల్లో పంట దెబ్బతింది. పొగాకు 4 వేల ఎకరాలు, మొక్కజొన్న 20 వేల ఎకరాలు, 12 వేల ఎకరాల్లో వరి పంట దెబ్బతిన్నట్లు ప్రాథమిక నివేదిక విడుదల చేసింది. పూర్తి స్థాయి నివేదికలో ఇందుకు భిన్నంగా 40 వేల ఎకరాల్లో మాత్రమే పంట నష్టం వాటిల్లిందని పేర్కొంది. ఈ నివేదికతో వేలాది ఎకరాల్లో పంట నష్టపోయిన రైతన్నకు పరిహారం అందలేదు.

పంట దిగుబడిని లెక్కలోకి తీసుకోకుండా పంట నష్టం అంచనా వేశారని రైతులు వాపోతున్నారు. అధికారుల ఏకపక్ష నిర్ణయాలతో తమకు అన్యాయం జరుగుతోందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పూర్తి విచారణ జరిపి తమకు న్యాయం చేయాలని వేడుకుంటున్నారు.

ABOUT THE AUTHOR

...view details