క్రికెట్ బెట్టింగ్ గుట్టురట్టు... ఇద్దరు అరెస్ట్ - west godavari
వరల్డ్‌కప్ ప్రారంభమైంది. క్రికెట్ బెట్టింగ్ ఊపందుకుంది. పల్లె నుంచి పట్టణం వరకూ బెట్టింగ్ జోరుగా సాగుతోంది. భీమవరంలో ఓ ఇంట్లో జరుగుతున్న బెట్టింగ్‌ను పోలీసులు రట్టు చేశారు.
పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలోని ఒకటో పట్టణ పరిధిలోని ఓ ఇంట్లో నిర్వహిస్తున్న క్రికెట్ బెట్టింగ్‌పై పోలీసులు దాడి చేశారు. కుమారస్వామి, కొత్త శ్రీనివాస్ అనే ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి రూ. 25వేలు నగదు, ఒక ఎల్ఇడి టీవీ, నాలుగు సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. క్రికెట్ బెట్టింగ్ వల్ల చాలా మంది అప్పులపాలై జీవితాలను నాశనం చేసుకుంటున్నారని సీఐ చంద్రశేఖర్ అన్నారు. భీమవరం పట్టణంలో ఎవరైనా క్రికెట్ బెట్టింగ్‌కు పాల్పడితే వివరాలను పోలీసులకు తెలియజేయాలని ఆయన కోరారు.