ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

తణుకులో క్రికెట్​ బెట్టింగ్​ ముఠా అరెస్ట్​ - తణుకు క్రైమ్​ వార్తలు

పశ్చిమగోదావరి జిల్లా తణుకులో క్రికెట్​ బెట్టింగ్​ ముఠాను పోలీసులు అరెస్ట్​ చేశారు. బెట్టింగ్​కు పాల్పడుతున్న​ ఐదుగురు వ్యక్తులను అరెస్ట్ చేశారు.

cricket betting group arrest at tanuku
cricket betting group arrest at tanuku

By

Published : Apr 20, 2021, 8:29 PM IST

పశ్చిమగోదావరి జిల్లా తణుకులో క్రికెట్​ బెట్టింగ్​ నిర్వహిస్తున్న స్థావరంపై పోలీసులు దాడి చేశారు. ఐదుగురు వ్యక్తులను అరెస్టు చేశారు. వారి నుంచి 4 సెల్​ఫోన్లు, ఒక ఎల్​ఈటీ టీవీ, రూ.2500 నగదును స్వాధీనం చేసుకున్నారు. ఈ క్రికెట్ బెట్టింగ్​తో తెలుగు రాష్ట్రాల్లోని మరో 20 మందికి సంబంధం ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.

విశ్వసనీయ సమాచారం మేరకు పోలీసులు వేల్పూర్ రోడ్డులోని సీఆర్​ఎస్​ఎస్ అపార్ట్​మెంట్​లో పోలీసులు దాడులు నిర్వహించారు. పాలంగి గ్రామానికి చెందిన బొక్క శివకుమార్, తిరుపతికి చెందిన చంద్రశేఖరరెడ్డి తణుకు చెందిన మహాపాత్ర హరీష్, కిరణ్ కుమార్, పైడిపర్రు గ్రామానికి చెందిన గొర్రెల సాయిబాబు అనే ఐదుగురు వ్యక్తులను అరెస్ట్ చేశారు. వీరికి సంబంధించిన బ్యాంకు అకౌంట్లను సీజ్ చేసినట్లు పోలీసులు తెలిపారు.

ఇదీ చదవండి: 'రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుంది'

ABOUT THE AUTHOR

...view details