ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

క్రికెట్ బెట్టింగ్ ముఠా అరెస్టు - క్రికెట్ బెట్టింగ్ ముఠా

క్రికెట్ బెట్టింగ్ స్థావరాలపై దాడి చేసి నలుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్న ఘటన పశ్చిమ గోదావరి జిల్లా పాలంగి గ్రామంలో చోటుచేసుకుంది. ఐపీఎల్ జట్లపై బెట్టింగ్ కాస్తుండగా.. నిందితులను అదుపులోకి తీసుకున్నారు.

క్రికెట్ బెట్టింగ్ ముఠా అరెస్టు
క్రికెట్ బెట్టింగ్ ముఠా అరెస్టు

By

Published : Sep 29, 2020, 10:01 PM IST

పశ్చిమ గోదావరి జిల్లా ఉండ్రాజవరం మండలం పాలంగి గ్రామంలో క్రికెట్ బెట్టింగ్ స్థావరంపై పోలీసులు దాడి చేశారు. గ్రామ పరిధిలోని వెంకట నారాయణ నగర్​లో ఒక ఇంటిలో బెట్టింగ్ నిర్వహిస్తున్నారన్న సమాచారంతో పోలీసులు దాడి చేశారు. ఐపీఎల్ జట్లపై బెట్టింగ్ కాస్తుండగా... నలుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు.

వారి వద్ద నుంచి ఒక కారు, రెండు ద్విచక్ర వాహనాలు, తొమ్మిది సెల్​ఫోన్లు, ఒక టీవీ, ల్యాప్ టాప్​లతోపాటు 1,500 నగదును స్వాధీనం చేసుకున్నారు. చట్టవిరుద్ధంగా క్రికెట్ బెట్టింగ్​లకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్సై అవినాష్ హెచ్చరించారు.

ABOUT THE AUTHOR

...view details