ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

వరద బాధితులను ప్రభుత్వం తక్షణమే ఆదుకోవాలి: రామకృష్ణ - సీపీఐ కార్యదర్శి రామకృష్ణ వార్తలు

గోదావరి వరద బాధితులను ప్రభుత్వం ఆదుకోవాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ డిమాండ్ చేశారు. పశ్చిమగోదావరి జిల్లాలోని వేలేరుపాడు, కుక్కునూరు మండలాల్లోని ముంపు గ్రామాల్లో ఆయన పర్యటించారు.

cpl andhra pradhesh secretary ramakrishna visit godavari floods in west godavari district
వేలేరుపాడు, కుక్కునూరు మండలాల్లో సీపీఐ రాష్ట్ర కార్యదర్శి పర్యటన

By

Published : Aug 26, 2020, 10:50 PM IST

పశ్చిమగోదావరి జిల్లాలోని గోదావరి ముంపు ప్రాంతాలైన వేలేరుపాడు, కుక్కునూరు మండలాల్లో సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ బుధవారం పర్యటించారు. వరద బాధితులను ప్రభుత్వం తక్షణం ఆదుకోవాలని కోరారు.

అలాగే ముంపు గ్రామాల్లోని ప్రతి కుటుంబానికి రూ.10 వేలు చొప్పున ఆర్థిక సహాయం అందించాలని డిమాండ్ చేశారు. వరదలతో దెబ్బ తిన్న ప్రతి ఎకరాకు రూ.15వేలు నష్టపరిహారం ఇచ్చి రైతులను ఆదుకోవాలన్నారు. పోలవరం నిర్వాసితులకు వెంటనే పునరావాసం కల్పించాలని కోరారు. సమస్యలు తీర్చకపోతే ఆందోళన చేస్తామని హెచ్చరించారు.

ABOUT THE AUTHOR

...view details