ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

డబ్బులిచ్చి ఏకగ్రీవాలు ఎందుకు చేసుకుంటున్నారో సీఎం చెప్పాలి: రామకృష్ణ - ap cm ys jagan

లక్షల రూపాయలు ఖర్చు చేస్తూ ఏకగ్రీవాలు ఎందుకు చేసుకుంటున్నారో చెప్పాలని సీఎం జగన్​ను సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ప్రశ్నించారు. చేసిన అభివృద్ధి గెలిపిస్తుందనుకుంటే ఇలా అడ్డదారులు తొక్కడం ఎందుకని నిలదీశారు. జగన్​కు దమ్ముంటే తమలా ప్రజల్లోకి వచ్చి ఓట్లు అడిగి గెలవాలని హితవు పలికారు.

సీపీఐ రామకృష్ణ
సీపీఐ రామకృష్ణ

By

Published : Mar 5, 2021, 10:11 PM IST

సీఎం జగన్​కు దమ్ము ధైర్యం ఉంటే తమ మాదిరిగా ప్రజల్లోకి వచ్చి ఓట్లు అడిగి గెలవాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె. రామకృష్ణ సవాల్ విసిరారు. పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులో సీపీఐ పార్టీ తరపున కార్పొరేషన్ ఎన్నికల్లో 15, 16 , 44 డివిజనల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన.. ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలు అభ్యర్థులను గెలిపిస్తాయనుకుంటే.. ఓట్ల కోసం ఎందుకు లక్షల రూపాయలు ఖర్చు పెడుతూ ఏకగ్రీవాలు చేసుకుంటున్నారో సమాధానం చెప్పాలన్నారు. ప్రజలపై విశ్వాసం ఉంటే స్వేచ్ఛగా ఎన్నికలు జరపాలని, అడ్డదారులు ఎందుకని ప్రశ్నించారు.

విశాఖ ఉక్కు పరిశ్రమ పరిరక్షణకు అన్ని రాజకీయ పార్టీలు మద్దతు ఇచ్చాయని... ఈ మేరకు అన్ని పార్టీలతో సమావేశం నిర్వహించి దిల్లీకి తీసుకువెళ్లాలని డిమాండ్ చేశారు. అంతేగాని పోస్కో అంటూ భజన చేస్తే మాత్రం మంచిది కాదని వ్యాఖ్యానించారు.

ABOUT THE AUTHOR

...view details