ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

భాజపాకు పవన్ మద్దతు సరికాదు: నారాయణ - cpi narayana on pawan kalyan latest news

సీపీఐ నేత నారాయణ అధికార పార్టీపై మండిపడ్డారు. ప్రత్యేక హోదా ఇవ్వని భాజపాకు పవన్ మద్దతు సరికాదని అన్నారు.

cpi narayana
సీపీఐ నారాయణ

By

Published : Apr 5, 2021, 2:27 PM IST

Updated : Apr 5, 2021, 3:17 PM IST

విపక్షాల్లో ఐక్యత కొరవడటంతోనే.. అధికార పార్టీ దుర్మార్గాలు పెరుగుతున్నాయన్నారు సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో సీపీఐ నేత నారాయణ కార్యకర్తల సమావేశంలో మాట్లాడిన ఆయన.. రాష్ట్రంలో అరాచక పాలన కొనసాగుతోందని మండిపడ్డారు. అధికార పార్టీ దుర్మార్గాలు పెరుగుతున్నాయని ఆరోపించారు.

జగన్ నియంతృత్వ ధోరణితో.. ప్రజాస్వామ్యం అంటే లెక్క లేకుండాపోయిందని ధ్వజమెత్తారు. చంద్రబాబు ఎన్నికలు బహిష్కరించటాన్ని తప్పుబట్టారు. ప్రత్యేక హోదా ఇవ్వని భాజపాకు.. పవన్ మద్దతు ఇవ్వడం సరికాదన్నారు. దేశంలోని 5 రాష్ట్రాల్లో జరగనున్న ఎన్నికల తర్వాత.. రాజకీయాల్లో పెను మార్పులు జరుగుతాయని అన్నారు.

ప్రధాని మోదీ రైల్వే స్టేషన్​లో టీ అమ్మినట్టు చెప్పటం అంతా అబద్ధం అన్నారు. మోదీ వేషధారణ, అలంకరణ కోసం నెలకు రూ.70 లక్షలను ఖర్చు చేస్తున్నారని ఆరోపించారు.

ఇదీ చదవండి:జెస్ట్ జోక్ చేశా.. ఆ గుర్తుకు ఓటేయ్యమని !

Last Updated : Apr 5, 2021, 3:17 PM IST

ABOUT THE AUTHOR

...view details