ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

బాబ్రీ ఘటన దోషులెవరో తేల్చాలి?: సీపీఐ ముస్లిం సమాఖ్య - పశ్చిమ గోదావరి వార్తలు

బాబ్రీ మసీదు కూల్చివేత ఘటనలో నిజమైన దోషుల నిగ్గు తేల్చాలని కోరుతూ పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో సీపీఐ అనుబంధ ముస్లిం సమాఖ్య ధర్నా నిర్వహించింది. దోషులెవరూ లేరంటూ సీబీఐ కోర్టు నిర్ణయించడం పట్ల నేతలు అభ్యంతరం వ్యక్తం చేశారు.

బాబ్రీ ఘటనపై సీపీఐ ముస్లిం సమాఖ్య ధర్నా
cpi-dharna-on-babri-masjid-demolition-case

By

Published : Oct 4, 2020, 2:17 PM IST

భాజపా అగ్రనేతలు రెచ్చగొట్టే ప్రసంగాలు చేయడం వల్లే కరసేవకులు బాబ్రీ మసీదును కూల్చివేశారని సీపీఐ అనుబంధ ముస్లిం సమాఖ్య నాయకులు అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా, తణుకులో దోషుల నిగ్గు తేల్చాలని ధర్నా చేశారు. అందరూ నిర్దోషులయితే దోషులెవరని ప్రశ్నించారు. కూల్చివేత ఘటనకు సంబంధించి 28 ఏళ్ల సుదీర్ఘ విచారణ తర్వాత దోషులెవరూ లేరని సీబీఐ కోర్టు తేల్చి చెప్పడం అత్యంత దారుణమన్నారు. బాబ్రీ మసీదు కూల్చివేత న్యాయబద్ధం కాదని దేశ అత్యున్నత న్యాయస్థానం పేర్కొన్నప్పటికీ దానికి వ్యతిరేకంగా తీర్పు వచ్చిందన్నారు. నిజమైన దోషుల నిగ్గు తేల్చాలని సీపీఐ జిల్లా కార్యదర్శి కోనాల భీమారావు డిమాండ్ చేశారు.

ఇదీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details