ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఏలూరు బాధితులను పరామర్శించిన సీపీఎం, సీపీఐ నేతలు

ఏలూరు బాధితులను సీపీఎం, సీపీఐ రాష్ట్ర నేతలు పరామర్శించారు. చికిత్స పొందుతున్న వారిని అడిగి వివరాలు తెలుసుకున్నారు. రాష్ట్రంలో చాలా మున్సిపాలిటీలు ఉండగా ఒక్క ఏలూరులోనే సమస్య రావడం ఏమిటని మధు ప్రశ్నించారు.

cpi cpm leaders visit eluru victims
ఏలూరు బాధితులను పరామర్శించిన సీపీఎం, సీపీఐ నేతలు

By

Published : Dec 8, 2020, 7:23 PM IST

ఏలూరు బాధితులను సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మధు, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ తదితరులు పరామర్శించారు. ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతున్న వారిని, వైద్యులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. గత 2 రోజులతో పోలిస్తే నేడు ఆసుపత్రికి వచ్చే వారి సంఖ్య తగ్గిందని.. అలాగే కోలుకున్న వారు అధికంగా ఉన్నారని వైద్యులు తెలిపారు. రాష్ట్రంలో చాలా మున్సిపాలిటీలు ఉండగా ఒక్క ఏలూరులోనే సమస్య రావడం ఏమిటని మధు ప్రశ్నించారు. దీనికి కారణాలు తెలుసుకోవాలని సూచించారు.

ABOUT THE AUTHOR

...view details