కేంద్ర ప్రభుత్వం అమల్లోకి తేనున్న నూతన వ్యవసాయ బిల్లుతో.. రైతులకు ఏమాత్రం ఉపయోగం లేదని వామపక్షాలు, కాంగ్రెస్ నేతలు వ్యాఖ్యానించారు. కేంద్రం తీరుపై తణుకులో నిరసన తెలిపాయి.
పట్టణంలోని పొట్టి శ్రీరాములు విగ్రహం వద్ద ఆయా పార్టీల నేతలు ఒక రోజు రిలే దీక్ష చేపట్టారు. తక్షణమే కేంద్రం ఈ బిల్లును ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.