పశ్చిమగోదావరి జిల్లా జంగారెడ్డిగూడెం పట్టణంలో రాజారాణి కల్యాణ మండపం సమీపంలోని శ్మశాన వాటికలో ఖననం చేసిన మృతదేహం ఒకటి వర్షాలకు బయటపడిన ఘటన శనివారం చోటు చేసుకుంది. ఐదు నెలల కిందట కరోనాతో మృతి చెందిన వ్యక్తిని కుటుంబ సభ్యులు ఈ శ్మశాన వాటికలో ఖననం చేశారు. వర్షాల కారణంగా మట్టి కొట్టుకుపోయి మృతదేహం బయటపడింది. దీనిని గుర్తించిన పోలీసులు పురపాలక అధికారులకు సమాచారం అందించారు. శనివారం ఆ మృతదేహాన్ని తిరిగి ఖననం చేయించామని పులపాలక కమిషనర్ శ్రావణ్‌కుమార్ తెలిపారు. కొవిడ్ బాధితుల మృతదేహాలను నిబంధనల మేరకు పూడ్చకపోవడం వల్లే ఇలా బయటపడుతున్నాయని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఇలాంటివి ఇంకెన్ని బయట పడతాయోనని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
వర్షాలకు బయటపడ్డ కొవిడ్ బాధితుడి మృతదేహం
పశ్చిమగోదావరి జిల్లా జంగారెడ్డిగూడెం పట్టణంలో కురిసిన వర్షాలకు శ్మశానవాటికలో ఖననం చేసిన ఓ మృతదేహం బయటపడింది. సమాచారం అందుకున్న అధికారులు... మృతదేహాన్ని తిరిగి ఖననం చేశారు.
వర్షాలకు బయటపడ్డ కొవిడ్ బాధితుడి మృతదేహం