దెందులూరు మండలం గోపన్నపాలెంలోని ఉన్నత పాఠశాలలో కొవిడ్-19 వ్యాక్సినేషన్ డ్రై రన్ జరిగింది. ఆశా, ఆరోగ్య కార్యకర్తలు ఎంపిక చేసిన ఇరవై ఐదు మందికి డ్రై రన్ నిర్వహించారు. వ్యాక్సిన్ వచ్చిన తర్వాత వాటిని ఉపయోగించటంపై అవగాహన కల్పించారు. జిల్లా ఇమ్యునిటీ అధికారి డాక్టర్ నాగేశ్వరరావు, డాక్టర్ పరమేశ్, డాక్టర్ త్రినాధ్ రెడ్డి, డాక్టర్ అభీషా ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షించారు.
గోపన్నపాలెంలో కొవిడ్ వ్యాక్సినేషన్ డ్రై రన్
పశ్చిమగోదావరి జిల్లా దెందులూరు మండలం గోపన్నపాలెంలో కొవిడ్ వ్యాక్సినేషన్ డ్రై రన్ నిర్వహించారు. వాక్సిన్ వచ్చిన తర్వాత వాటిని వేయటంపై అవగాహన కల్పించేందుకు ఈ కార్యక్రమం ఏర్పాటు చేశారు.
కొవిడ్ వ్యాక్సినేషన్ డ్రై రన్