ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'ప్రాణాలకు తెగించి పనిచేసినా ఫలితం దక్కలేదు' - ఏలూరులో ఆందోళనకు దిగిన కొవిడ్ తాత్కాలిక వైద్య సిబ్బంది

ప్రాణాలకు తెగించి కొవిడ్ సమయంలో సేవలందిన తమకు.. వేతనాలు ఇవ్వకుండా బయటకు పంపడాన్ని తాత్కాలిక వైద్య సిబ్బంది ఖండించారు. తమకు న్యాయం చేయాలంటూ.. పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులో నిరసన చేపట్టారు. తమ డిమాండ్లు తీర్చాలని నినాదాలు చేశారు.

temporary health workers protest
ధర్నా చేస్తున్న కొవిడ్ తాత్కాలిక వైద్య సిబ్బంది

By

Published : Dec 2, 2020, 6:51 PM IST

కొవిడ్ సమయంలో తాత్కాలిక ఉద్యోగులుగా పనిచేసిన తమకు న్యాయం చేయాలంటూ.. పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులో వైద్య సిబ్బంది ఆందోళనకు దిగారు. కలెక్టరేట్ వద్ద బైఠాయించి ధర్నా చేపట్టారు. ప్లకార్డులు ప్రదర్శిస్తూ నిరసన తెలిపారు.

తాత్కాలికంగా పని చేయించుకుని.. వేతనాలు ఇవ్వకుండా బయటకు పంపడాన్ని వైద్యులు ఖండించారు. తమ డిమాండ్లు నెరవేర్చాలంటూ నినాదాలు చేశారు. ప్రాణాలకు తెగించి సేవలందించినా.. తమకు ఎటువంటి ప్రయోజనం కల్పించలేదని మండిపడ్డారు.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details