పశ్చిమ గోదావరి జిల్లాలో కరోనా కేసులు విజృంభిస్తున్నాయి. శుక్రవారం రికార్డు స్థాయిలో 1131 కేసులు రాగా... శనివారం సైతం 854 కేసులు వచ్చాయి. వీటితో కలిపి ప్రస్తుతం జిల్లాలో 29,156 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఆగస్టు నుంచి జిల్లాలో లాక్డౌన్ను సడలించారు. ఆదివారం కర్ఫ్యూను ఎత్తేశారు. దీంతో కేసుల తీవ్రత తారాస్థాయికి చేరింది. గత వారం రోజులుగా 800కు పైగా పాజిటివ్ కేసులు జిల్లాలో నమోదయ్యాయి. ప్రస్తుతం ఏలూరులో రెండు కొవిడ్ ఆసుపత్రులు, రెండు కొవిడ్ కేర్ సెంటర్లను ఏర్పాటు చేశారు. తణుకు, తాడేపల్లిగూడెం, భీమవరం ప్రాంతాల్లో కొవిడ్ కేర్ కేంద్రాలను ఏర్పాటు చేసి చికిత్స అందిస్తున్నారు.
లాక్డౌన్లో మినహాయింపులు..పెరుగుతున్న కొవిడ్ కేసులు - west godavari district latest news
జిల్లాలో కొవిడ్ కేసులు విజృంభిస్తున్నాయి. శుక్ర, శనివారాల్లో సైతం 1131, 854 కేసులు నమోదయ్యాయి. ఇప్పటికే లాక్డౌన్లో మినహాయింపులివ్వగా.. ఆదివారం కర్ఫ్యూను సడలించారు. దీంతో కేసులు సంఖ్య అమాంతం పెరిగింది.
జిల్లాలో పెరుగుతున్న కొవిడ్ కేసులు