ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

విషాదం: కుటుంబ కలహాలతో దంపతుల ఆత్మహత్య - విషాదం: కుటుంబ కలహాలతో దంపతుల ఆత్మహత్య

కుటుంబంలో చెలరేగిన కలహాలు రెండు ప్రాణాల్ని బలితీసుకున్నాయి.  పశ్ఛిమగోదావరి జిల్లా కవ్వకుంటలో భార్యభర్తలు  ఆత్మహత్యకు పాల్పడ్డారు.

విషాదం: కుటుంబ కలహాలతో దంపతుల ఆత్మహత్య

By

Published : Aug 18, 2019, 5:53 AM IST

కుటుంబ కలహాలతో ...ఆత్మహత్య

పశ్చిమగోదావరి జిల్లా పెదవేగి మండలం కవ్వకుంటకు చెందిన జయరాజు(36), వెంకమ్మ(25)లు దంపతులు. భర్త అరటి పండ్ల వ్యాపారం..భార్య కూలీ పనులే ఆ కుటుంబానికి ఆదాయ వనరు. వీరికి ఇద్దరు ఆడపిల్లలు. ఆర్థిక సమస్యలో..మరింకేం బాధలో తెలీదు తరచూ ఘర్షణ పడేవారని వెల్లడైంది. ఆ కుటుంబ కలహాలే వారి ఆత్మహత్యకు కారణమయ్యాయి. వెంకమ్మ ఇంట్లో ఉరేసుకుని చనిపోగా..ఆమె భర్త వరండాలో బలవన్మరణానికి పాల్పడ్డాడు. తల్లిదండ్రుల మరణంతో వారి పిల్లలు అనాథలయ్యారని బంధువులు బోరున విలపిస్తున్నారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details