ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కొవిడ్​ వ్యాక్సిన్​ తీసుకున్న యువకుడు మృతి..? - west godavari district latest updates

పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లుకు చెందిన ఓ యువకుడు మంగళగిరిలోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. అతను కొవిడ్​ వ్యాక్సిన్​ వికటించి మృతి చెందాడని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. వ్యాక్సిన్ తీసుకోక ముందు తమ కుమారుడు బాగానే ఉన్నారన్న తల్లిదండ్రులు.. వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత అస్వస్థతకు గురయ్యారని తెలిపారు.

కొవిడ్ వ్యాక్సిన్ వికటించి యువకుడు మృతి
కొవిడ్ వ్యాక్సిన్ వికటించి యువకుడు మృతి

By

Published : Aug 24, 2021, 7:12 PM IST

పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లుకు చెందిన ఓ యువకుడు మంగళగిరిలోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఈ నెల 21న పాలకొల్లులో వ్యాక్సిన్ తీసుకున్న యువకుడు అనంతరం అనారోగ్యం పాలయ్యాడు. వెంటనే స్పందించిన ఆ యువకుని తల్లిదండ్రులు.. స్థానికంగా ఓ ఆస్పత్రిలో చేర్పించారు. పరిస్థితి విషమించిందని విజయవాడ లేదా ఇతర ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకెళ్లాలని వైద్యులు సూచించారు.

అయితే మంగళగిరిలోని ఓ ఆస్పత్రిలో చేర్పించగా... యువకుడికి మెదడులోని నరాలు చిట్లినట్లు వైద్యులు గుర్తించారు. వ్యాక్సిన్ తీసుకోక ముందు తమ కుమారుడు బాగానే ఉన్నాడని..వ్యాక్సిన్ తీసుకున్న తర్వాతే అస్వస్థతకు గురైనట్లు తల్లిదండ్రులు చెప్పారు.

ఇదీ చదవండి:

ASSEMBLY: సెప్టెంబర్ మూడో వారంలో అసెంబ్లీ సమావేశాలు

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details