పశ్చిమగోదావరి జిల్లాలో కరోనా కేసుల సంఖ్య రోజురోజుకూ అధికమవుతోంది. లాక్ డౌన్ సడలించాక.. ఏలూరు, భీమవరం, నరసాపురం ప్రాంతాల్లో కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది. 24గంటల వ్యవధిలో జిల్లాలో 11 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఏలూరు 6, పెరవళి 2, పెదపాడు, లింగపాలెం, తాడేపల్లిగూడెం ప్రాంతాల్లో ఒక్కో కేసు నమోదైంది. జిల్లాలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 192కు చేరుకుంది.
విజృంభిస్తున్న కరోనా... ఒక్క రోజే 11 కేసులు - పశ్చిమ గోదావరిలో కరోనా కేసులు
పశ్చిమగోదావరి జిల్లాలో కరోనా విజృంభిస్తూనే ఉంది. 24 గంటల వ్యవధిలోనే 11 కేసులు నమోదయ్యాయి. జిల్లాలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 192కు చేరుకుంది.
పశ్చిమ గోదావరిలో కరోనా కేసులు
జిల్లాలో 58మంది డిశ్చార్జ్ కాగా... 115 మంది ఏలూరు ఆశ్రమ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఏలూరులో అత్యధికంగా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. జిల్లాలో నమోదైన కేసుల్లో సగానికి పైగా ఏలూరు నగరంలోనే నమోదు కావడం గమనార్హం. కొత్తగా పాజిటివ్ కేసులు నమోదైన ప్రాంతాల్లో రెడ్ జోన్లను ఏర్పాటు చేసి.. ప్రజల రాకపోకలపై నిషేధం విధించారు.
ఇదీ చదవండి: రాష్ట్రంలో కొత్తగా 210 కరోనా పాజిటివ్ కేసులు