తెలుగుదేశం నాయకుడు చింతమనేని ప్రభాకర్‌ను పోలీసులు అరెస్ట్ చేయగా.... ఏలూరు గ్రామీణ పోలీస్‌స్టేషన్‌లో అర్ధరాత్రి వరకూ హైడ్రామా నడిచింది. అచ్చెన్నాయుడిని మంగళగిరికి రోడ్డు మార్గంలో తరలిస్తున్నందున.... ఆ మార్గంలో చింతమనేని ఆందోళనలు చేపట్టకుండా..... నిన్న మధ్యాహ్నం ఆయనను పోలీసులు ముందుగానే అరెస్ట్ చేశారు. ఆయనపై కేసు నమోదు చేసిన పోలీసులు... న్యాయమూర్తి ముందు హాజరుపర్చేందుకు కొవిడ్ పరీక్షలు తప్పనిసరన్నారు. అందుకు నిరాకరించిన చింతమనేని... పోలీస్‌స్టేషన్‌లో కిందే కూర్చుని నిరసన తెలిపారు.
అర్ధరాత్రి హైడ్రామా... చింతమనేనికి కొవిడ్ పరీక్షలు
మాజీ ఎమ్యెల్యే చింతమనేని ప్రభాకర్ అరెస్టు తీవ్ర ఉత్కంఠకు దారితీసింది. పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు గ్రామీణ పోలీస్టేషన్లో అర్ధరాత్రి హైడ్రామా చోటుచేసుకుంది. పోలీసు స్టేషన్లోనే చింతమనేనికి అర్ధరాత్రి కోవిడ్ పరీక్షలు నిర్వహించారు.
అర్ధరాత్రి సమయంలో చింతమనేనికి పరీక్షలు
తనతో పాటు తనను అరెస్ట్ చేసిన పోలీసులకూ కొవిడ్ పరీక్షలు చేయాలన్న ఆయన డిమాండ్‌కు ఉన్నతాధికారులు అంగీకరించటంతో.... అర్ధరాత్రి సమయంలో పరీక్షలు పూర్తి చేశారు. ఇవాళ ఉదయం న్యాయమూర్తి ముందు హాజరుపర్చనున్నారు. అంతకముందు.... పోలీస్ స్టేషన్‌లో ఉన్న చింతమనేని ఆరోగ్యపరిస్థితిపై తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ ఫోన్ ద్వారా ఆరా తీశారు.
ఇవీ చదవండి