ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

జిల్లా అంతటా విస్తరిస్తున్న కరోనా - పశ్చిమ గోదావరి జిల్లాలో కరోనా కేసులు తాజా వార్తలు

కరోనా పుంజుకుంటోంది. ప్రజలను కలవరపరుస్తోంది. మారుమూలకూ విస్తరించింది. లాక్‌డౌన్​ను కఠినంగా అమలు చేస్తున్నా.. చిన్న పొరపాట్లతో ప్రజలు మహమ్మారి బారిన పడుతున్నారు. జిల్లాలోని ఏలూరు, తాడేపల్లిగూడెం, భీమవరం, పెనుగొండ తదితర పట్టణ ప్రాంతాలకు పరిమితమైన ఈ వైరస్‌ మన్యానికీ విస్తరించింది. తాజాగా టి.నరసాపురం, పోలవరంలలో కేసులు నమోదయ్యాయి.

corona spread in agency areas
కొవ్వూరులో హైపోక్లోరైట్‌ ద్రావణం పిచికారీ

By

Published : Apr 27, 2020, 5:24 PM IST


జిల్లాలో సానుకూల వాతావరణం ఏర్పడుతున్న తరుణంలో ఆదివారం ఒక్కసారిగా 12 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. మొత్తం కేసుల సంఖ్య వీటితో కలిపి 51కి చేరింది. తొలుత నమోదైన కేసుల్లో పది మంది కోలుకోగా.. యంత్రాంగం వారిని ఇటీవల ఆసుపత్రి నుంచి ఇళ్లకు పంపించింది. ప్రస్తుతం మరికొందరు చికిత్స పొందుతూ కోలుకుంటున్నారు. పూర్తిస్థాయి ఆరోగ్యవంతులుగా మారుతున్నారు. వారిలో కొందరికి నెగిటివ్‌ రిపోర్టులు వచ్చాయని, తుది నివేదికలు రాగానే డిశ్చార్జి చేస్తామని అధికారులు చెబుతున్నారు.

ABOUT THE AUTHOR

...view details