పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం సబ్ కలెక్టర్ కార్యాలయంలో భీమవరంకు చెందిన పీహెచ్సీ డాక్టర్‌కు కరోనా పాజిటివ్ రావడంతో కార్యాలయ సిబ్బంది , వైద్యులు అప్రమత్తమయ్యారు. కార్యలయం అంతా రసాయనాలతో శుభ్రపరిచారు. సిబ్బంది అందరికి వైద్య పరీక్షలు నిర్వహించారు. అయితే ప్రజలు ఎవరూ భయపడాల్సిన పని లేదని నరసాపురం సబ్ కలెక్టర్ విశ్వనాథన్ తెలిపారు. ప్రాథమిక కాంటాక్ట్స కి వైద్య పరీక్షలు నిర్వహించామని అందరికి నెగటీవ్ వచ్చినట్లు తెలిపారు. నరసాపురంలో ఇప్పటి వరకు ఒకరికే పాజిటివ్ వచ్చి కొలుకున్నారని కలెక్టర్ వెల్లడించారు. వదంతులు నమ్మొద్దున్నారు. నరసాపురంలో ఏ ప్రభుత్వ కార్యాలయం రెడ్ జోన్లో లేవని నరసాపురం సబ్ కలెక్టర్ కె.ఎస్ వి శ్వనాథన్ తెలిపారు.
నరసాపురం సబ్ కలెక్టర్ కార్యాలయంలో కరోనా పాజిటీవ్.. అప్రమత్తమైన సిబ్బంది - covid cases in narsapuram
పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఉద్యోగికి కరోనా రావటంతో సిబ్బంది అప్రమత్తమయ్యారు. బాధితుడితో దగ్గర సంబంధం ఉన్న అందరికి వైద్య పరిక్షలు నిర్వహించారు.
నరసాపురం సబ్ కలెక్టర్ కార్యాలయంలో కరోనా పాజిటీవ్.. అప్రమత్తమైన సిబ్బంది
TAGGED:
covid cases in narsapuram