పశ్చిమ గోదావరి జిల్లా అత్తిలి మండలంలో తాజాగా 8 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కావడం కలకలం రేపింది. పెళ్లి దుస్తుల కోసం అత్తిలికి చెందిన వారు దువ్వ గ్రామస్థలతో కలిసి విజయవాడ వెళ్లి రావడంతో ఐదుగురికి పాజిటివ్ నమోదైంది. వీరిలో అత్తిలిలో ముగ్గురికి, దువ్వ లో ఇద్దరికీ పాజిటివ్ వచ్చింది. తాజాగా వీరి కుటుంబానికి చెందిన 8 మందికి పాజిటివ్ వచ్చింది. దీంతో వారి సన్నిహితులు, చుట్టు పక్కల ప్రజలు భయపడుతున్నారు. పాజిటివ్ కేసులు వచ్చిన వారితో సంబంధం ఉన్న వారిని పదుల సంఖ్యలో క్వారంటైన్ కేంద్రాలకు తరలిస్తున్నారు.
పెళ్లి షాపింగ్ చేశారు..కరోనా బారిన పడ్డారు - అత్తిలిలో కరోనా కేసులు
పశ్చిమగోదావరి జిల్లాలో కరోనా కేసులు పెరుగుతూనే ఉన్నాయి. తాజాగా అత్తిలి మండలంలో 8 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. పెళ్లి బట్టల కోసం అత్తిలికి చెందిన వారు దువ్వ గ్రామస్థలతో కలిసి...విజయవాడకు వెళ్లి షాపింగ్ చేసి వచ్చారు. వీరిలో ఇప్పటివరకు 8 మందికి పాజిటివ్ రాగా..మిగిలిన వారిని క్వారంటైన్ కు తరలించారు.
corona positive
జిల్లా వ్యాప్తంగా వివిధ గ్రామాల్లో కరోనా సోకుతోంది. అత్తిలి మండలంలో మొత్తం పాజిటివ్ కేసులు 38కి పెరగడంతో అధికారులు అప్రమత్తమై ప్రత్యేక చర్యలు చేపట్టారు.
ఇదీ చదవండి:ఒక్కరోజులో 24,248 కేసులు.. మూడో స్థానానికి భారత్