ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కరోనా సోకినా అధికారులకు చెప్పలేదు! - జంగారెడ్డి గూడెంల కరోనా కేసులు

బంధువులను కలిసేందుకు వెళ్లిన ఆ విశ్రాంత అధికారికి కరోనా పాజిటివ్​గా నిర్థణ అయ్యింది. స్వస్థలానికి వెళ్లిన ఆయన.. అధికారులకు ఎటువంటి సమాచారం అందించలేదు. చివరికి అధికారులే బాధితుడిని గుర్తించి కొవిడ్ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటన పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డి గూడెంలో జరగింది.

corona-positive-case-registers-in-gangareddy-gudem-at-west-godavari-district
కరోనా సోకినా అధికారులకు చెప్పలేదు!

By

Published : Jul 16, 2020, 9:35 PM IST

పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డిగూడెంలో మరో కరోనా పాజిటివ్ కేసు నమోదు అయింది. పట్టణానికి చెందిన విశ్రాంత తపాల శాఖ ఉద్యోగి ఇటీవల భీమవరంలో బంధువులను కలిసేందుకు వెళ్లారు. అక్కడ అనారోగ్యంగా ఉండటంతో కరోనా పరీక్షలు నిర్వహించారు. గురువారం పాజిటివ్​గా నిర్ధరణ కావడంతో విశ్రాంత ఉద్యోగి జంగారెడ్డిగూడెం వచ్చేశారు.

సమాచారం అందుకున్న వైద్యాధికారులు బాధితుడిని గుర్తించి ఏలూరు కొవిడ్ ఆస్పత్రికి తరలించారు. పరిసర ప్రాంతాల్లో సూపర్ శానిటేషన్ పూర్తిచేసి ప్రాథమిక, సెకండరీ కాంటాక్ట్ వివరాలను సేకరిస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details