పశ్చిమగోదావరి జిల్లా పెనుగొండ మండలంలో కరోనా బాధితుల సంఖ్య రోజురోజుకు పెరుగుతుంది. ఇప్పటికే మండలంలో 15 కేసులు నమోదు కాగా ఇవాళ సిద్ధాంతం గ్రామానికి చెందిన గ్రామ సచివాలయ ఉద్యోగికి పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. సదరు వ్యక్తి రామన్నపాలెం గ్రామ సచివాలయంలో విధులు నిర్వహిస్తున్నాడు. కొన్ని సందర్భాల్లో మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయంలోనూ విధులు నిర్వహిస్తూ ఉండటం వల్ల తోటి ఉద్యోగుల్లో ఆందోళన నెలకొంది. బాధితుణ్ని చికిత్స నిమిత్తం వైద్యాధికారులు ఏలూరు ఐసోలేషన్ వార్డుకు తరలించారు. ఇతనితో సన్నిహితంగా ఉన్న ఆరుగురు కుటుంబ సభ్యులను అధికారులు క్వారంటైన్‌కు తరలించారు.
గ్రామ సచివాలయ ఉద్యోగికి కరోనా.. తోటి ఉద్యోగుల్లో ఆందోళన - పశ్చిమ గోదావరి జిల్లా సిద్ధాంతం గ్రామం వార్తలు
పశ్చిమగోదావరి జిల్లా పెనుగొండ మండలం సిద్ధాంతం గ్రామానికి చెందిన గ్రామ సచివాలయ ఉద్యోగికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. ఈ క్రమంలో తోటి ఉద్యోగుల్లో ఆందోళన నెలకొంది. కరోనా సోకిన వ్యక్తితో పాటు అతనితో సన్నిహితంగా ఉన్న ఆరుగురు కుటుంబ సభ్యులను అధికారులు క్వారంటైన్‌కు తరలించారు.
సచివాలయ ఉద్యోగికి కరోనా పాజిటివ్ ఉద్యోగుల్లో ఆందోళన
TAGGED:
west godavari corona updates