ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ముందు నెగిటివ్.. తర్వాత పాజిటివ్! - పశ్చిమగోదావరి జిల్లాలో కరోనా కేసులు

పశ్చిమ గోదావరి జిల్లా టీ. నరసాపురం మండలం ఏపిగుంట గ్రామంలో కరోనా పాజిటివ్ కేసు నమోదైంది. అతను దిల్లీ వెళ్లి వచ్చిన కుటుంబాన్ని కలిసిన కారణంగా.. వారినీ 14 రోజులు క్వారంటైన్​లో ఉంచారు. అనంతరం సదరు వ్యక్తికి పరీక్షల్లో నెగిటివ్​ అని తేలిన కారణంగా.. ఇంటికి పంపారు. అంతలోనే... మళ్లీ పాజిటివ్ వచ్చిందంటూ ఆసుపత్రికి తరలించారు.

corona positive case at eepigunta west godavari district
పశ్చిమగోదావరి జిల్లాలో కరోనా కేసులు

By

Published : Apr 26, 2020, 4:52 PM IST

పశ్చిమ గోదావరి జిల్లా టీ నరసాపురం మండలం ఏపిగుంట గ్రామంలో ఓ వ్యక్తికి కరోనా వైరస్ ఉన్నట్లు తేలింది. అతడిని ఏలూరు క్వారంటైన్​కు తరలించారు. అతని కుటుంబ సభ్యులతోపాటు మొత్తం 19 మందిని తాడేపల్లిగూడెం ఐసోలేషన్ వార్డుకు తరలించినట్లు అధికారులు చెప్పారు. కరోనా పాజిటివ్ వచ్చిన వ్యక్తి దిల్లీ నుంచి వచ్చిన ముస్లిం కుటుంబాన్ని కలిసిన కారణంగా.. 14 రోజులు తాడేపల్లిగూడెం క్వారంటైన్​లో ఉంచారు.

శనివారం ఉదయం అతనికి ఎలాంటి లక్షణాలు లేవని గ్రామానికి పంపించారు. అయితే మధ్యాహ్నం 2 గంటల సమయంలో కరోనా పాజిటివ్​గా తేలినట్టు అధికారులకు సమాచారం అందింది. వెంటనే అతడిని ఆసుపత్రికి తరలించాలంటూ జిల్లా వైద్యాధికారులు ఫోన్ చేయగా మండలంలోని రెవెన్యూ, పోలీసు అధికారులు అప్రమత్తం అయ్యారు. వెంటనే అతన్ని ఏలూరుకు తరలించారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details