ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

అయ్యో.... వాహనంపైనే అనంతలోకాలకు! - corona deaths in west godavari

కరోనా.. కనికరం లేకుండా ప్రాణాలు బలి తీసుకుంటోంది. ఎప్పుడు ఎవరిని అంతం చేస్తుందన్నదీ అర్థం కాకుండా పోతోంది. పశ్చిమ గోదావరి జిల్లా ఆకివీడులో.. ఓ వ్యక్తి అనారోగ్యంతో ఆసుపత్రికి వెళ్తుండగా.. వాహనంపైనే తుది శ్వాస విడిచిన తీరు.. తీవ్ర ఆవేదనకు గురి చేస్తోంది.

man died on bike at akiveedu
man died on bike at akiveedu

By

Published : May 8, 2021, 9:39 AM IST

పశ్చిమ గోదావరి జిల్లా ఆకివీడు పట్టణంలో విషాదం జరిగింది. కృష్ణా జిల్లా కలిదిండి మండలం చినతాడినాడ గ్రామానికి చెందిన కలిదిండి రాంబాబు (63)కు కరోనా లక్షణాలు బయటపడ్డాయి. ఈనెల 4న నమూనాలు ఇవ్వగా ఇంకా ఫలితం రాలేదు.

శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది పడుతున్న రాంబాబును అల్లుడు నరసింహులు శుక్రవారం ద్విచక్ర వాహనంపై కూర్చోబెట్టుకుని ఆకివీడు ఆసుపత్రికి బయలుదేరాడు. మార్గమధ్యలోనే రాంబాబు ఇలా వాహనంపైనే ప్రాణాలు కోల్పోయాడు. ఆస్పత్రి వైద్యులు పరీక్షించి మృతి చెందినట్లు నిర్ధారించారు.

ABOUT THE AUTHOR

...view details