కరోనా వ్యాప్తి దృష్ట్యా పశ్చిమగోదావరి జిల్లా ఉండ్రాజవరంలో అధికారులు లాక్డౌన్ విధించారు. పాల కేంద్రాలు, ఔషధ దుకాణాలు మినహాయించి మిగిలిన అన్ని దుకాణాలు మూతపడ్డాయి. మండల పరిధిలోని 15 గ్రామాల్లో పోలీస్ బృందాలు గస్తీ తిరిగాయి. మండల కేంద్రం ఉండ్రాజవరంతో పాటు మండలంలోని గ్రామాల్లో గడిచిన వారం రోజుల్లోనే సుమారు యాభై కేసు నమోదు కావడంతో అధికారులు మరింత అప్రమత్తమయ్యారు. కేసు నమోదైన ప్రాంతాలను రెడ్ జోన్‌గా ప్రకటించి దిగ్బంధం చేశారు.
ఉండ్రాజవరంలో పూర్తిస్థాయి లాక్డౌన్ - పశ్చిమగోదావరి జిల్లా ఉండ్రాజవరంలో కరోనా కేసులు
కరోనా విజృంభణతో పశ్చిమగోదావరి జిల్లా ఉండ్రాజవరం మండలం అధికారులు అప్రమత్తమయ్యారు. మండలంలోని 15 గ్రామాల్లో పూర్తి లాక్‌డౌన్‌కు పిలుపునిచ్చారు. బంద్ కారణంగా గ్రామాల్లోని ప్రధాన రహదారులు నిర్మానుష్యంగా మారాయి.
ఉడ్రాజవరంలో పూర్తిస్థాయి లాక్డౌన్